Header Banner

విజయవాడలో ఉద్రిక్తత! షర్మిలపై బీజేవైఎం దాడి! అసలు ఏం జరిగిందో తెలుసా!

  Thu May 01, 2025 09:22        Politics

ప్రధాని మోడీ అమరావతికి రాకవేళ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై విజయవాడలో బీజేవైఎం కార్యకర్తలు దాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ దగ్గర నిరసనకు దిగిన షర్మిలపై బీజేవైఎం కార్యకర్తలు కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. షర్మిల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ముట్టడించారు.


కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి కోసం వచ్చిన బీజేవైఎం కార్యకర్తలకూ, కాంగ్రెస్ కార్యకర్తలకూ మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకున్నా ఇరుపక్షాల మద్య బాహా బాహీ కొనసాగింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా బిజేవైఎం కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో బిజేవైఎం నేతల ను పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. బీజేవైఎం కార్యకర్తల తీరుపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఇది కూడా చదవండిఏపీకి రూ.172 కోట్లతో మరో కొత్త మాల్! ఆ నగరంలో ఫిక్స్..!

 

బిజెపి నాయకులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఏపీలో వైసిపి ఉన్నా, కూటమి ఉన్నా అధికార పెత్తనం మాత్రం బిజెపిదే అన్నారు. గత పదకొండేళ్లుగా రాష్ట్రాన్ని మోడీ నాశనం చేశారన్నారు. టిడిపి, జనసేన, వైసిపి నాయకులూ ఎలాగూ పశ్నించరని, మోడీ మోసాలను నిలదీస్తే తనను టార్గెట్ ఛేసి దాడి చేయిస్తారా అని షర్మిల ప్రశ్నించారు. కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేస్తారా అని అడిగారు.

 

ఏపీసీసీ అధ్యక్షురాలి పైనే ఇలా దాడికి తెగబడితే.. మా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపలకు వచ్చారంటే పోలీసులు సహకారం లేకుండా వస్తారా అని అడిగారు. ఎవరైతే ఇప్పుడు దాడిలో ఉన్నారో అందరి పైనా హత్యా యత్నం కేసులు నమోదు చేయాలన్నారు. మీ అన్యాయాలను ప్రశ్నిస్తే సహించలేరా.. మోసాలు బయట పెడితే దాడి చేస్తారా అని షర్మిల నిలదీశారు. ఈ ఘటనల‌పై కూటమి ప్రభుత్వం తనకు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ఇదేనా మీ పాలనలో మహిళలకు జరిగే న్యాయం అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీసులు వారి పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SharmilaVsBJP #CongressOfficeClash #YSSharmila #BJPGoons #AttackOnWomenLeader #PoliticalViolence